రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో RC 16 మూవీ బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్ట‌గా బోనీ క‌పూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ చేతుల మీదుగా చిత్ర యూనిట్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు.

ఇందులో రామ్‌చ‌ర‌ణ్ జ‌త‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది.

RC 16  ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి చిత్ర స‌మ‌ర్ప‌కులు సుకుమార్, దిల్ రాజు, శిరీష్, సాహూ గారపాటి, రామ్ ఆచంట, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి, నాగవంశీ తదితరులు హాజ‌ర‌య్యారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సినిమా తెరకెక్కుతుంది.

RC 16  ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అల్లు అర‌వింద్, బోనీ క‌పూర్, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ తదితరులు హాజ‌ర‌య్యారు.

RC 16  ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి  గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్‌, చిత్ర ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా తదితరులు హాజ‌ర‌య్యారు.