మలబద్ధకం పెద్ద సమస్యలా మారింది. పెద్దలు, వృద్ధులకే పరిమితమయ్యాయి.
తల్లిదండ్రులు తమ పిల్లలకు అధిక మొత్తంలో ఆవు పాలు ఇస్తున్నారు. ఇది శిశువులలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
ఏడాది లోపు పిల్లలకు ఆవుపాలు ఇవ్వరాదని నిపుణులు చెబుతున్నారు.
మొదటి 6 నెలలు తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలి. తల్లికి పాలు పడకపోతే డాక్టర్ సలహా మేరకు ఫార్ములా మిల్క్ ఇవ్వాలి.
6 నెలల తర్వాత తల్లి పాలు లేదా ఫార్ములా మిల్క్ తో పాటు గణ పదార్థాలను ఇవ్చొచ్చు.
పిల్లలలో మలబద్ధక సమస్యకు ముఖ్య కారణం ఆవు పాలు. ఆవు పాలలో కేసైన్ ప్రొటీన్ అధికంగా ఉంటుంది.
ఆవు పాలను అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
మలబద్దకంతో పాటు రక్తహీనత, అలెర్జీలు, మూత్రపిండాల సమస్యలకు కారణమవుతుంది.
థైరాయిడ్ సమస్యలు, నీరు తాగకపోవడం, ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వంటివి ఉన్నాయన్నారు.
ఇంకా అనేక సమస్యలున్నాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.