తరచూ పారాసిటమాల్ వేసుకోవడం మంచిది కాదట.
ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డవారు మరింత అప్రమత్తంగా ఉండటం మంచిది.
తరచూ వాడటం వల్ల జీర్ణకోశం, గుండె, కిడ్నీ సమస్యల ముప్పు పెరగటానికి కారణమవుతున్నట్లు అధ్యయణంలో వెల్లడైంది.
పారాసిటమాల్ వాడకంతో జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావమయ్యే ముప్పు 24% పెరుగుతుందట.
పేగుల్లో రక్తస్రావమయ్యే ముప్పు 36% పెరుగుతున్నట్టు తేలింది.
అలాగే కిడ్నీజబ్బు (19%), గుండె వైఫల్యం (9%), అధిక రక్తపోటు (7%) వచ్చే అవకాశమూ ఎక్కువవుతున్నట్టు బయటపడింది.
వృద్ధుల్లో కీళ్లనొప్పుల వంటి వాటికి పారాసిటమాల్ వాడొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.