రోజూ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడే వ్యక్తి ఉన్నట్లుండి వచ్చిరాని తెలుగులో మాట్లాడటం చూశారా?

ఏదో అసలు తెలుగే రాని వారిలా మాట్లాడుతున్నారా? కొంతమంది కావాలనే సరదాకు అలా మాట్లాడినా కొంతమందికి మాత్రం సహజంగానే వచ్చేస్తుంది.

ఎందుకంటే ఇదో రకమైన జబ్బు! ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ అరుదైన వ్యాధి పేరు ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్. 

ఈ జబ్బుతో బాధపడేవారిలో ఉన్నట్లుండి భాష ఉచ్ఛరణ మారిపోతుందట.

1907లో పియరీ మోరీ అనే ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ తొలిసారిగా ఈజబ్బును తన వద్దకు వచ్చిన పేషెంట్ లో గుర్తించారు.

ఈ జబ్బు ఎంత అరుదైనదంటే.. ఇప్పటివరకు రికార్డ్స్ ఉన్నవి 60 కేసులే. ఈ జబ్బు రావడానికి కచ్చితమైన కారణాలను వైద్యులు చెప్పలేకపోతున్నారు.

బ్రెయిన్ స్ట్రోక్ లేదా మెదడుకు ఏదైనా బలమైన గాయమైతే ఈ జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నది కొందరి వాదన.

స్పీచ్ థెరపీతో జబ్బు నయం అవుతుంది అంటారు వైద్యులు. మరి మీరెప్పుడైనా మీకు తెలియకుండానే ఇలా సడెన్గా ఫారిన్ భాష మాట్లాడారా?