చలికాలం వచ్చిందంటే వాతావరణం మారిపోతుంది. చల్లని వాతావరణాన్ని తట్టుకోవడానికి శరీరం ఇబ్బంది పడుతోంది.

అందుకే శరీరాన్ని కాపాడడం కోసం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటు కొన్నింటిని దూరంగా పెట్టడం అవసరం. 

 పండ్ల రసాలు, శీతల పానీయాలు, కేకులు వంటి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇలా పంచదార అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి. 

ముందే ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇవి తింటే మరింతగా బలహీన పడుతుంది. 

అలాగే ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన ఆహారాన్ని వెంటనే తినొద్దు. కాసేపు బయట ఉంచి.. గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక తీసుకోవాలి.  

డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, వేపుళ్ళు వంటి వాటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇలాంటి కొవ్వు పదార్థాలు చలికాలంలో తినడం హానికరం.

చలికాలంలో శరీరం ఆ కొవ్వును కరిగించలేదు. కొవ్వు విపరీతంగా శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల బరువు పెరిగిపోతారు. 

ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు. చలికాలంలో పాల ఉత్పత్తులను తగ్గించాలి. పెరుగు వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి.

 స్మూతీలు, షేక్స్ వంటివి చల్లగా ఉన్నప్పుడు తాగకూడదు. ఇది శ్లేష్మం ఉత్పత్తిని పెంచేస్తుంది. దీనివల్ల ఊపిరాడటం కష్టంగా మారుతుంది. 

అలాగే మాంసాహారాన్ని తక్కువగా తినాలి. మితంగా తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. మితంగా తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.