మధుమేహం ఒంట్లో పేరుకుపోయి ఒక్కసారిగా బయటపడి భయపెడుతుంది.
ప్రస్తుతం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు దీని బారిన పడుతున్నారు.
దీన్ని పూర్తిగా నివారించే మందు మనకు అందుబాటులోకి రాలేదు. కొన్ని ఆహార పదార్థాలను విస్మరిస్తే.. షుగర్‌ను నియంత్రించవచ్చు.
వైట్ రైస్: తెల్ల అన్నంలో కార్బోహైడ్రేడ్లు, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.
వైట్ బ్రెడ్: వైట్ బ్రెడ్‌లో చక్కెర శాతం, కార్బోహైడ్రేడ్లు అధికం. ఇవి మన శరీరంలో షుగర్ లెవెల్స్‌ని అమాంతం పెంచేస్తాయి.
కొవ్వుతీయని పాలు : హోల్ మిల్కులో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది కొలస్ట్రాలను పెంచేస్తుంది.
షుగర్ ఉన్నవాళ్లు హోల్ మిల్క్‌తో పాటు పాలకోవ, మైసూర్‌పాక్ వంటి డైరీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.
బంగాళాదుంపలు: షుగర్ లెవెల్స్‌ను పెంచేసే గుణం కూడా బంగాళాదుంపలకు ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
ఎండు ద్రాక్ష : ఎండు ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
ఫ్రెంచ్ ఫ్రైస్: బంగాళాదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలో వాడే పదార్థాలు షుగర్ పేషెంట్లకు మంచిదికాదు.
మటన్: మేక, గొర్రె మాంసాలకు షుగర్ పేషెంట్లు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.