వ‌య‌స్సు మీద ప‌డేకొద్దీ జ్ఞాప‌క‌శ‌క్తి స‌న్నగిల్లుతుంది. దీంతో వృద్ధాప్యంలో చాలా మంది అల్జీమ‌ర్స్ బారిన ప‌డుతుంటారు.

జ్ఞాప‌క‌శక్తి, ఏకాగ్రత కూడా త‌గ్గిపోతుంటాయి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు మెద‌డును యాక్టివ్‌గా ఉంచుకోవాలి.

 జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్రత పెంచే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..  

వారంలో క‌నీసం రెండు సార్లు చేప‌ల‌ను తింటే మ‌తిమ‌రుపు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల అధ్యయ‌నంలో వెల్లడైంది. 

ఎందుకంటే చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, డీహెచ్ఏ, ఈపీఏ ఉంటాయి. ఇవి మెద‌డు క‌ణాల‌ను నిర్మిస్తాయి.  

ఆకుకూర‌ల‌ను తిన‌డం వల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ముఖ్యంగా పాల‌కూర‌, తోట‌కూర వంటివి తింటే విట‌మిన్లు ఎ, కె ల‌భిస్తాయి. 

 మెద‌డుకు శ‌క్తి అందించేందుకు తృణ ధాన్యాల‌ను తింటే మంచిది. బ్రౌన్ బ్రెడ్‌, బ్రౌన్ రైస్‌, మిల్లెట్స్‌, ఓట్స్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

 దీంతో మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది.  

అలాగే కోడిగుడ్లు, డార్క్ చాక్లెట్లు, న‌ట్స్‌, ప‌సుపు, గుమ్మడికాయ విత్తనాలు వంటి ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకోవాలి.