గుండెను ఆరోగ్యంగా ఉంచే  10 ఆహారాలు

ముదురు రంగు సోయా బీన్స్: గుండెకు కావాల్సిన మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, ఫొల్లెట్ వీటిల్లో పుష్కలంగా ఉంటాయి

రెడ్ వైన్: రెడ్ వైన్‌లో 70 శాతం ‘కోకో కేట్ ఛిన్స్’ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది

చేపలు: సాల్మన్ చేపల్లో వుండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌.. నరాల్లో రక్త సరఫరాను క్రమబద్ధం చేసి, గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి

వాల్ నట్స్: ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు.. అధిక కొల్లెస్టరాల్‌ను నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

బాదాం: ఇందులో క్యాల్షియమ్, విటమిన్ ఈ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేకూరిస్తాయి

స్వీట్ పొటాటో: ఇందులోని గ్లిసిమిక్ ఇండెక్స్.. మధుమేహం, గుండె సమస్యల నివారణకు సహాయపడుతుంది

సిట్రస్ పండ్లు: వీటిల్లో ఉండే ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్.. రక్తపోటు తగ్గించి, గుండెకు రక్షణ కలిగిస్తాయి

క్యారెట్: రోజూ ఒక పచ్చి క్యారెట్‌ తింటే.. శరీరంలోని చెడుకొవ్వు తగ్గి, రక్తపీడనం సరైన స్థాయికి చేరుకుంటుంది. తద్వారా గుండె జబ్బులు దరి చేరవు

ఓట్స్: వీటిల్లో ఉండే బెటాగ్లూకాన్ అనే పీచు పదార్థం.. శరీరంలో కొలెస్ట్రాల్‌ని నియంత్రించి, గుండె సమస్యల్ని నివారిస్తుంది

చెర్రీ: ఈ చెర్రీస్ ఒక లో-గైసిమిక్ ఇండెక్స్ ప్రూట్. ఇందులో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించే ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది