శీతాకాలంలో చాలా మందికి తలలో చుండ్రు సమస్య తీవ్రంగా పెరుగుతుంది.
చలికాలంలో చుండ్రు పెరగడానికి ఒక ప్రధాన కారణం వేడి నీటితో తలస్నానం చేయడమేనని నిపుణులు చెబుతున్నారు.
వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల తలపై ఉండే సహజ నూనెలు పోయి, తల పొడిగా మారుతుంది.
పెరుగుతన్న కాలుష్యంతో దుమ్ము, ధూళి తలమీదకు చేరి.. చివరికి చుండ్రుగా మారుతుంది. ఈ సమస్య తగ్గాలంటే..
ఓ చిన్న గిన్నెలో రెండు స్పూన్ల ఆవ నూనె, జాంబా నూనె (అరుగుల ఆకు నూనె), పటిక పొడి కలిపి మిశ్రమం తయారు చేయాలి.
ఈ మిశ్రమాన్ని తల మాడుకు పట్టించి, ఒకటి నుండి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత తలకు షాంపూతో శుభ్రం చేయాలి.
టీ ట్రీ ఆయిల్ కూడా చుండ్రు సమస్యలపై సమర్థవంతంగా పనిచేస్తుంది.
కలబంద గుజ్జులోని యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాల వల్ల చుండ్రు తగ్గుతుంది.
వేప నూనె లేదా వేప ఆకుల రసాన్ని తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్యను నియంత్రించవచ్చు.