అందరి ముందు పదే పదే  బేవ్ మని తేన్పులు తీస్తూ కనుబొమ్మలు ఎగరేస్తే కొంచెం అసౌకర్యంగా ఉంటుంది.

 ఆహారం అధికంగా తీసుకున్నప్పుడు భుక్తాయాసంతో పాటు కడుపులో నుంచి గాలి బ్రేవ్ మంటూ ఉత్పన్నమవుతుంది.

  ఈ విధంగా బ్రేవ్ మంటూ గాలి ఉత్పన్నమవటాన్నే న్పు లేదా తేపు అంటారు. ఇవి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి.  

 నిమ్మరసం: ఉదయం నిద్రలేచిన వెంటనే పుల్లని తేన్పులు వస్తే.. ఒక గ్లాసు నిమ్మరసం తాగండి.

 పెరుగు: పెరుగు పుల్లటి తేనుపును తొలగిస్తుంది. పుల్లటి తేన్పు సమస్య నుంచి తక్షణ ఉపశమనం ఇస్తుంది.

సోపు: సోపు  పంచదార మిఠాయిని కలిపి తినడం ద్వారా, పుల్లని తేనుపు నుంచి ఉపశమనం పొందవచ్చు.   

ఇంగువ: ఇంగువ జీర్ణక్రియకు ఉత్తమమైనది. గ్యాస్ లేదా పుల్లని తేనుపు సమస్య ఉంటే, మీరు ఇంగువను ఉపయోగించవచ్చు.    

 జీలకర్ర: పుల్లటి తేన్పు, గ్యాస్ లేదా అజీర్ణం తగ్గించడానికి జీలకర్రను వేయించి తింటే ఉపశమనం కలుగుతుంది 

  ఏలకులు: ఏలకులు తీసుకోవడం వల్ల పుల్లటి తేన్పు నుంచి ఉపశమనం పొందవచ్చు.   

 లవంగం:  పుల్లటి తేనుపు సమస్య ఉంటే లవంగం నీరు  తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది.