మానవ శరీరంలో అతి ముఖ్య అవయవం మెదడు. 

ఇది చురుకుగా ఆరోగ్యంగా ఉంటేనే.. మన శరీరం అనే యంత్రం సజావుగా నడుస్తుంది. 

అయితే, గాడి తప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, నిద్రలేమి, పొగ, మద్యం వంటి వ్యసనాలు మెదడును మొద్దుబారేలా చేస్తుంటాయి. 

ఈ నేపథ్యంలోనే మెదడును ఆరోగ్యంగా ఉంచే 5 సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

మొట్ట మొదటిది 7-8 గంటల విశ్రాంతి తప్పనిసరి.ఇలా నిద్రిస్తే.. మెదడే కాదు శరీర భాగాలన్నీ పునరుత్తేజమవుతాయి.  

ఒత్తిడికి లోనవ్వొద్దు. మెదడు తీవ్ర ఒత్తిడికి లోనై.. దీర్ఘకాలిక దుష్ప్రభావాలు తలెత్తుతాయని చెబుతున్నారు.

సెల్‌ఫోన్‌ ఎక్కువగా చూడటం మానేయాలి. ఫోన్ కిరణాలు కంటిపై పడి తలనొప్పితో మొదలవుతుంది. 

హెడ్‌ఫోన్లను కూడా ఎక్కువగా వాడొద్దు. హెడ్‌ఫోన్ల శబ్దాలు 60% కంటే ఎక్కువైతే.. మెదడు సాధారణ స్థితికి దూరమవుతుందట.

తీపి పదార్థాలు తినడం మానేయాలి. వీటిని మెదడు పనితీరు ప్రభావితం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అంతే కాకుండా చక్కర స్థాయి ఎక్కువగా ఉండే పానీయాలను వారానికి 200-355 మి.లీ. మాత్రమే తీసుకోవాలి.