జలుబు చేసినప్పుడు సాధారణంగా నీటిని అలానే తాగకూడదు.. వేడి చేసి తాగాలి.  

 అదే వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

 ఆవిరిపట్టడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. దీని వల్ల మూసుకుపోయిన ముక్కురంధ్రాలు తెరుచుకుంటాయి.  

 వేడి పాలల్లో కాసింత పసుపు కలిపుకొని తాగండి. రాత్రి వేళల్లో బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.  

అల్లం టీ తాగడం వల్ల మంచిది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు, జలుబు వల్ల వచ్చే దగ్గుని తగ్గిస్తుంది. 

  తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది.  

మిరియాల పాలు తాగినా జలుబు త్వరగా తగ్గుతుంది. అయితే, మిరియాలు ఎక్కువగా వేసుకోకూడదు వేడి చేస్తుంది.  

 జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. 

 వేడివేడి సూప్స్ తాగడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది.