నిద్ర మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు 

నిద్ర మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు 

మంచి, గాఢమైన నిద్ర పొందేందుకు ముందుగా మీ దినచర్య, ఆహారపు అలవాట్లను సమతుల్యంగా ఉంచుకోవడం ముఖ్యం.

రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. 

రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకుండా, కనీసం ఒకటిన్నర నుంచి రెండు గంటల గడువుతో నిద్రపోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా జరిగి నిద్ర మెరుగుపడుతుంది.

  నిద్రపోయే ముందు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం నిద్రపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 

ఈ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ మెదడును చురుకుగా ఉంచి నిద్రలో అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.  

రోజూ 10-15 నిమిషాలు ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పడుకునే ముందు తేలికపాటి నడక కూడా నిద్రకు సహాయపడుతుంది.   

నిబంధితమైన నిద్రకు మనశ్శాంతి కూడా కీలకం. ఒత్తిడి ఉన్నపుడు, అది నిద్రకు ప్రభావం చూపుతుంది. 

మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అశ్వగంధ, సర్పగంధ వంటి ఆయుర్వేద మూలికలను ఉపయోగించవచ్చు..