ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్ళు పక్కన పెట్టుకోండి.
నిప్పు రవ్వలు ఒంటిపైని దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్ దుస్తులనే (పాలిస్టర్ కాకుండా) ధరించడం మంచిది.
ఒక వేళ మీ ఇంటి పక్కన ఉన్న ఏ గుడిసె పైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్ సర్వీసెస్‌కు ఫోను చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్ నెంబరు గుర్తుపెట్టుకోండి.
నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నాల్, దూది, అయోడిన్, టించర్, డెట్టాల్ తదితరాలతో కూడిన ఫస్‌ట ఎయిడ్ కిట్ సిద్ధం చేసుకోండి.
ప్రాధమిక వైద్యం చేసిన తరువాత కొంత ఉపశమనం పొందినప్పటికీ తప్పక వైద్యుని వద్దకు వెళ్ళి పూర్తి చికిత్స చేయించుకోవడం ముఖ్యం.
పిల్లల దీపావళి సామాగ్రిని కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం.
బాంబులను ఎవరు కాల్చినా పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూది పెట్టడం మరచిపోవద్దు. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది.
విడి బాంబులు లేదా సీరియల్‌గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది.
వీటిని కాల్చేటప్పుడు వచ్చి పోయే వారిని గమనించండి. అత్యంత ముఖ్యంగా థౌజండ్ వాలా, 10 థౌజండ్ వాలా సీరీస్‌ను కాల్చేటప్పుడు.
పిల్లల చేతికి రాకెట్, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు.
మీ దీపావళి సామాగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరు వత్తులను ఉంచవద్దు.
వెలిగి పేలకుండానే ఆరిపోయిన చిచ్చుబుడ్లు లేదా బాంబుల వద్దకు వెళ్ళి పరిశీలించడం, మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం.