చేపలు మాత్రమే కాదు, చేపల గుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చేపల గుడ్లు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చేపగుడ్లను వండటం చాలా మందికి తెలియదు. కానీ అది పెద్ద కష్టమేం కాదు. చేపలు వండినట్లుగానే చేపగుడ్లను కూడా రకరకాలుగా కూరలు వండుకోవచ్చు.
ఫ్రై చేసుకుని కూడా తినవచ్చు. వండే విధానం తెలియకపోతే యూట్యూబ్‌లో చూసి మీకు నచ్చిన ఫ్లేవర్‌లో వండుకోండి. వాటిని ఏ పద్ధతిలో వండుకున్నా ఆరోగ్య ప్రయోజనాలు ఒకేలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చేపగుడ్లలో విటమిన్ A ఉంటుంది. ఈ విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది. కళ్లకు హాని జరుగకుండా కాపాడుతుంది.
రెగ్యులర్‌గా చేపగుడ్లు తింటే మీ రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి చేపగుడ్లు దివ్యౌషధంలా పనిచేస్తాయి.
చేపగుడ్లలో విటమిన్ D కూడా ఉంటుంది. ఇది మీ ఎముకలు, దంతాలను బలంగా తయారు చేస్తుంది. అంతేగాక గుండె జబ్బులు రాకుండా విటమిన్ D కాపాడుతుంది.
మతిమరపు సమస్య ఉన్నవారు, అల్జీమర్స్ పేషెంట్లు క్రమం తప్పకుండా చేపగుడ్లు తినాలి. దాంతో సమస్య నుంచి త్వరగా పరిష్కారం లభించే అవకాశం ఉంది.
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి కూడా చేపగుడ్లు చాలా మంచివి. రెగ్యులర్‌గా చేపగుడ్లను ఆహారంగా తీసుకుంటే బీపీ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.