కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

RK రోజా ఏపీలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

మెగాస్టార్ చిరంజీవి  రాష్ట్ర మంత్రిగా కాకుండా మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పర్యాటక శాఖ ను స్వతంత్ర్య హోదాలో బాధ్యతలు నిర్వహించారు.

కృష్ణంరాజు  రెబల్ స్టార్ కృష్ణంరాజు అప్పటి వాజ్ పేయ్ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఎన్టీఆర్  అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం రేపారు. అంతేకాదు  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 3 సార్లు ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసారు.

జయలలిత  జయలలిత తమిళనాడు  రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. దాదాపు పలుమార్లు  ముఖ్యమంత్రి అయ్యారు.

స్మృతి ఇరానీ  స్మాల్ స్క్రీన్ స్టార్ స్మృతి ఇరానీ.. 2014, 2019లలో నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో కేంద్ర క్యాబినేట్ మంత్రిగా  పలు శాఖలను నిర్వహించారు.

చిరాగ్ పాశ్వాన్  తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో బిహార్ లోని హాజిపూర్ నుంచి ఎంపీగా గెలిచి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ క్యాబినేట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు

మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపీ తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లో కేరళలోని త్రిస్సూర్ నుంచి ఎంపీగా గెలిచి సంచలనం రేపారు.