మెంతులు చేదుగా ఉంటాయి కదా అని వాటిని దూరం పెట్టకండి. అవి మనల్ని ఎన్నో అనారోగ్యాల నుంచి కాపాడేస్తాయి.

మెంతులకు రోగాల్ని నయం చేసే అద్భుత గుణాలున్నాయి. ఇవి ఆకలిని పెంచగలవు. చర్మ సమస్యలకు చెక్ పెట్టగలవు.

వికారం, కడుపులో తిప్పుతున్నట్లుగా అనిపించడం, తలనొప్పి వంటివి ఉంటే... రెండు టీ స్పూన్ల మెంతుల్ని నీటిలో ఉడకబెట్టి రాత్రి పడుకునే ముందు ఆ నీటని తాగండి.

పొట్టలో గ్యాస్, ఏసీడీటీ లాంటివి ఉంటే... అర టీస్పూన్ మెంతుల పౌడర్‌ను మజ్జిగలో కలిపి తాగండి. అంతే సమస్య పోతుంది.

2 టీస్పూన్ల మెంతుల్ని నానబెట్టి, గుజ్జుగా చేసి... ఓ కప్పు పెరుగులో కలపాలి. దాన్ని తలకు పట్టించేయాలి. వారానికి ఇలా రెండుసార్లు చేస్తే చుండ్రు పోతుంది.

రోజూ ఉదయం వేళ 1 టీస్పూన్ మెంతి పౌడి తీసుకుంటే... బీపీ క్రమ పద్ధతిలో ఉంటుంది.

మెంతుల ఆకుల్ని ఉడికించి ఆ నీటిని తాగాలి. లేదా మెంతులను నమలాలి. దీని వల్ల బాడీలో నొప్పులు కొన్ని రోజుల్లోనే తగ్గుతాయి.

 మెంతుల్ని నాన బెట్టిన నీటిని తాగడం, మెంతులు నమలడం, వంటల్లో వేసుకోవడం, పచ్చళ్లలో వేసుకోవడం ఇలా ఎలా వాడినా... అవి బాడీలో చెడు కొవ్వును కరిగిస్తాయి. 

మెంతుల్ని 15 రోజులు రెగ్యులర్‌గా వాడితే వెన్నునొప్పి తగ్గుతుంది.