రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శైవక్షేత్రం. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా కొలువుదీరాడు.  

 సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెల్లి మల్లన్న. 500 ఏళ్ల క్రితం నుంచే శివుడు మల్లన్న రూపంలో పూజలందుకుంటున్నాడు. 

  కాకతీయులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. శిల్పసంపదకు రామప్ప ఆలయం నిలయం. 

జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న   కాళేశ్వర ముక్తీశ్వరాలయం. యముడికి ప్రత్యక్షమైనందున శివుడిని కాళేశ్వరుడు అంటారు. 

 హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడి. 12 వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడు. 

  హైదరాబాద్‌​కు దగ్గరో ఉన్న కీసర గట్టు శైవక్షేత్రం.  ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. 

  వనపర్తి జిల్లా పాన్‌గల్‌లో పురాతన ఛాయా సోమేశ్వరాలయం. ఈ శైవక్షేత్రంలో శివలింగం మీద నిత్యం నీడ ఉండడం ప్రత్యేకత. 

 యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాచకొండ శైవక్షేత్రం. ఇది సింగ భూపాలుడి కాలంలో ప్రతిష్టించిన పది అడుగుల అరుదైన రాతి శిల్పం.

 వరంగల్ జిల్లాలోని "ఐనవోలు శైవక్షేత్రం" ఆరో విక్రమాదిత్యుడి మంత్రి అయ్యనదేవుడు క్రీ.శ 1076లో కట్టించాడని చరిత్ర.   

నల్గొండకు సమీపంలో శ్రీరాముడు ప్రతిష్టించిన చిట్టచివరి లింగమే చెరువుగట్టు రామలింగేశ్వరుడు.