వేసవిలో ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్‌తో ముఖం కడుక్కోవడం అసలు మర్చిపోవద్దు.

జిడ్డు చర్మం ఉన్నవారు ఆయిల్ ఫ్రీ క్లెన్సర్‌తో ముఖాన్ని వాష్‌ చేసుకోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, దుమ్ము, ధూళి తొలగిపోతాయి.

వాతావరణంలో మార్పుల కారణంగా, గాలిలో ఉండే ధూళి కణాలు చర్మంపై పేరుకుపోతాయి.

ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోతే కొంతకాలానికి అవి మొటిమలు లేదా నల్లటి మచ్చలకు కారణమవుతాయి.

చర్మాన్ని స్క్రబ్ చేయడం ఎంతో ముఖ్యం. స్క్రబ్బింగ్ చేయడం వల్ల ముఖంపై మృత కణాలు తొలగిపోయి మెరుపును సంతరించుకుంటుంది.

స్కిన్ కేర్ రొటీన్ లో వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఉత్తమం.

పసుపు, క్రీమ్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మిలమిల మెరుస్తుంది.

చర్మ సంరక్షలో పసుపుది కీలక పాత్ర. మొటిమలను తగ్గించడంలోనూ పసుపు సహాయపడితే, చర్మాన్ని తేమగా ఉంచడంలో క్రీమ్‌ బాగా హెల్ప్‌ చేస్తుంది.

గాలిలోని కాలుష్యం చర్మంపై చెడు ప్రభావం చూపుతుంది. మృతకణాల కారణంగా ముఖం ట్యానింగ్‌కు గురికావచ్చు.

దీని నుంచి ఉపశమనం పొందాలంటే ముఖానికి ఆవిరి పట్టడం ఎంతో ముఖ్యం.

సీజన్‌ ఏదైనా సరే, చర్మంపై మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిందే. అలాగే రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి క్రీమ్ అప్లై చేయాలి.