కళ్లు చాలా సున్నితమైనవి. వీటి  ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే.. మీ కంటిచూపు దెబ్బతినొచ్చు. మొత్తం కంటిచూపే పోవచ్చు.

అందుకే కళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇకపోతే కళ్లు ఎర్రబారడానికి కారణాలు చాలానే ఉన్నాయి.

కొంతమంది కళ్లు ఎప్పుడు చూసినా ఎర్రగానే ఉంటాయి. నిజానికి కళ్ల గురించి, వాటి ఆరోగ్యం గురించి పట్టించుకునే వారు చాలా తక్కువ మందే ఉన్నారు.

ముఖ్యంగా ఎక్కువ అలిసిపోతే కూడా కళ్లు ఎర్రబడతాయి. ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లను ఎక్కువ వాడటం వల్ల కూడా కళ్లు ఎర్రబడతాయి.

తెల్లవార్లు నిద్రపోకున్నా ఇలాగే అవుతుంది. అలాగే బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కూడా కళ్లు ఎర్రగా మారతాయి.

కళ్లు ఎర్రబడటం వల్ల కంటినొప్పి, చికాకు వంటి సమస్యలు వస్తాయి. అసలు కళ్లు ఎందుకు ఎర్రబడతాయి.. వాటిని ఎలా తగ్గించుకోవాలి

కొంతమందికి పువ్వుల అలెర్జీ కూడా ఉంటుంది. పువ్వుల వల్ల కలిగే పుప్పొడి అలెర్జీ కళ్లను ఎర్రగా మారడానికి కారణమవుతుంది.

దుమ్ముకు, ధూళికి, మట్టికి అలెర్జీ ఉంటే కూడా కళ్లు ఎర్రగా మారతాయి.

కళ్లకు లెన్స్ ను ధరించడం వల్ల చాలా సార్లు ఇన్ఫెక్షన్స్ , రాత్రిపూట కాంటాక్ట్ లెన్సులను ధరించడం అస్సలు మంచిది కాదు

కళ్లు ఎర్రగా మారడానికి బ్లెఫరిటిస్ అనే ప్రమాదకరమైన వ్యాధి కూడా ఒక కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కళ్లు ఎర్రగా మారితే కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. ముందుగా కళ్లను శుభ్రంగా కడగండి. ఆ తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ చుక్కలను వేయండి.

దీనివల్ల కంటి ఇన్ఫెక్షన్స్, కంటిలోని మురికి తొలగిపోతుంది. కళ్ల ఎరుపుదనం పోతుంది.