టెక్నాలజీ డెవలప్ అవడంతో మొబైల్ ఫోన్ వినియోగం కూడా ఎక్కువవుతోంది.

ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అంతకు రెండింతలు నష్టాలు కూడా ఉన్నాయి.

మగవారు మొబైల్ ఫోన్‌ ఎక్కువగా ఉపయోగిస్తే పిల్లలు పుట్టరా అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు.

మొబైల్ ఫోన్‌ను మగవారు ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మానసిక ఒత్తిడి వంటి కారణాలతో పురుషుల్లో సంతానలేమి సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.

 వీలైనంతవరకు ఎలక్ట్రిక్ వస్తువులకు రేడియేషన్ వస్తువులకు దూరంగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు.

మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణం ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి వచ్చే రేడియేషన్ అని అంటున్నారు. 

కాగా దేశంలో 23 శాతం మగవారు ఫెర్టిలిటీ అనే సమస్యతో బాధపడుతున్నారు.

ఇప్పటికైనా మగవాళ్లు మొబైల్‌ ఫోన్‌ను తక్కువగా ఉపయోగించాలంటున్నారు నిపుణులు.