హొగెనక్కల్

త్వరలో దసరా సెలవులు రానున్నాయి.

ఈ సెలవుల్లో ఎంజాయ్ చేయాలంటే తమిళనాడులోని హొగెనక్కల్ వెళ్ళాల్సిందే.

ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జల తరంగాల హోరు.

మనసును పరవశింపచేసే  ప్రకృతి అందాల జోరు.

ఆధునిక ప్రపంచానికి సుదూరంగా, సహజత్వానికి చేరువగా ఉండి చూపరులను కళ్ళు చెదిరే తన్మయత్వానికి గురిచేసే  అందాల జలపాతం హోగెనక్కల్

దగ్గరకు వెళ్ళేవరకు ఆనవాలు కూడా కనిపించని ఈ జలపాతానికి కి.మీ. దూరంనుండే ఝుమ్మనే శబ్దం వినిపిస్తుంది.

భారత నయాగరా జలపాతంగా పిలిచే ఈ జలపాతం అందాలను వానాకాలంలో చూసిన వారెవ్వరైనా ఆనందంతో తడిసిముద్దయిపోతారు.

ఇక్కడి రెండు కొండల ఒకే కొండ రెండుగా మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం.

ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం సాహసమే. ఇవన్ని కూడా హొగెనక్కల్లో అనుభవించాల్సినవే!

బెంగళూరు లేదా చెన్నై నుంచి రోడ్డు, రైలు మార్గంలో వెళ్తే 4 గంటల్లో ఇక్కడకు చేరుకోవచ్చు.