మహిళలు వారి చేతివేళ్ల అందం కోసం నెయిల్ పాలిష్ వేసుకుంటారు.
కొన్నాళ్ల క్రితం ఫంక్షన్లు, పెళ్లి వంటి సందర్భాలలో నెయిల్ పాలిష్ పెట్టుకునే వారు.
కానీ ప్రస్తుతం ఏ రంగు దుస్తులు ధరిస్తే, ఆ రంగు నెయిల్ పాలిష్ ను వాడుతున్నారు.
దీనివల్ల చేతి, కాలి గోళ్ళకు మరింత అందం వస్తుంది.
కానీ ఈ గోళ్లరంగు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.
గోళ్ల రంగు తయారీలోనే ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం కలుపుతారు.
దీని వల్ల నెయిల్ పాలిష్ గోళ్లపై ఎక్కువ రోజులు ఉంటుంది.
ఈ రసాయనం మన శరీరంలో ఉండే హార్మోన్లపై ఎఫెక్ట్ చూపిస్తుందట.
అలాగే, రోజూ నెయిల్ పాలిష్ వేసుకుంటే బరువు పెరుగుతారట.
నెయిల్ పాలిష్ చర్మానికి అంటుకోవడం వల్ల చర్మ క్యాన్సర్, అలెర్జీ, దురదలు వస్తాయి.