అందరికీ ఒక పర్టిక్యులర్ వయసులోనే పెళ్లి చేసుకోవాలని అనిపించదు. కొంత మందికి పెళ్ళికంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి.

కెరీర్ లో ఒక స్టేజ్ కి వచ్చి, వాళ్ళు అనుకున్నది సాధించిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు.

05062F

అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. 

ఏజ్ గ్రూప్ లో జీవితం పై పూర్తి స్పష్టత వస్తుంది. వీలైనంత వరకు కెరియర్ పై ఫోకస్ చేసి డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. 

దాంతో వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టడం కష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఒకరిపై ఒకరికి ఆకర్షణ తగ్గిపోతుంది. దాంతో వైవాహిక జీవితం చాలా డల్ గా సాగుతుంది అని నిపుణులు అంటున్నారు.

వేరే విషయాల మీదకి, అంటే ఉద్యోగం, డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోవడంతో ఒకరిపై ఒకరికి శ్రద్ధ దగ్గి.. వేరే రిలేషన్ షిప్ వైపు ఫోకస్ చేస్తారట.

సమాజం నుండి వచ్చే ఒత్తిడిని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాని వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి.

భవిష్యత్తు ఎలా ఉండాలి ? జీవితం ఎలా ప్లాన్ చేసుకోవాలి ? అనే విషయంలో పడి ప్రస్తుతం ఉన్న మూమెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.

ఏదేమైనా సరే ఇందాక పైన చెప్పినట్టుగా పెళ్లి అనేది ఒక వ్యక్తి పర్సనల్ ఛాయిస్. కాబట్టి ఎవరిని కూడా జడ్జ్ చేయలేము.