కివిలో విటమిన్లు సి, ఇ, ఎ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి.  దగ్గు, నరాల సమస్య తొలగిపోతుంది.

సపోటలో గర్భిణీలకు కళ్లు తిరిగడం, వికారం వంటి సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. విరేచనాలు, కడుపు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

నేరేడు పండులోవిటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, ఐరన్, పొటాషియం. ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి.  రక్తహీనత నుండి రక్షించడానికి పనిచేస్తుంది.

ఆపిల్ గర్భధారణ సమయంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఆపిల్ పిల్లలను అలర్జీ నుండి కాపాడుతుంది.

నారింజ పండ్లు విటమిన్ సి, ఫోలేట్, నీరు సమృద్ధిగా ఉండటం వల్ల నారింజ ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది.

1 కప్పు తరిగిన మామిడికాయలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది విటమిన్ సి రోజువారీ అవసరాన్ని తీరుస్తుంది. ఇది పిల్లల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

పియర్‌లో పీచు, ఫోలేట్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. గర్భధారణ సమయంలో వీటిని తినడం వలన మలబద్ధకం ఏర్పడదు. ఇది పిల్లల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

దానిమ్మలో విటమిన్లు, క్యాల్షియం, ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా మారడంలో సహాయపడుతుంది.

విటమిన్ బి, కాపర్, ఫైబర్ సమృద్ధిగా ఉండే అవకాడో శిశువు చర్మానికి, మెదడుకు మేలు చేస్తుంది. ఇది గర్భిణీ స్త్రీల కాళ్లలో వచ్చే తిమ్మిరి సమస్యను దూరం చేస్తుంది.