ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. సరైన నిద్ర లేకుంటే మార్నింగ్ అన్ ఈజీగా అనిపిస్తుంది.
ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే పడుకునే ముందు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
బాదంలో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి ప్రశాంతంగా నిద్రపోయేలా తోడ్పడతాయి.
టర్కీ కోడి మాంసంలో ట్రిప్టోఫాన్ అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రకు ఉపక్రమించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ పడుకునే ముందు చామంతి టీ తాగడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
నిద్రలేమితో బాధపడేవారు రోజూ రాత్రి కివీస్ తినడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు.
పడుకునే ముందు టార్ట్ చెర్రీ జ్యూస్ తాగడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
సాల్మన్, ట్యూనా, ట్రౌట్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.
ఫ్యాటీయాసిడ్లు మెదడులోని రసాయనాల సమతుల్యతను కాపాడతాయి. నిద్రకు ఉపక్రమించే సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి.
రోజూ రాత్రి వాల్నట్స్ తినడం వల్ల హాయిగా నిద్రపడుతుందని నిపుణులు పేర్కొన్నారు.