మన శరీరంలో సగానికి పైగా నీటితో నిండి ఉంటుంది.
నీరు ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు.
నీళ్లు తాగడం వల్ల అందం, ఆరోగ్యం, ఫిట్‌నెస్ పెరుగుతుందని కొంత మంది లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతుంటారు.
అయితే నీళ్లు ఎక్కువగా తాగడం మంచిదే అయినా.. ఇదీ మోతాదులోనే ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు ఎన్ని లీటర్లు నీళ్లు తాగాలో తెలుసుకుందాం.
మహిళలు ప్రతి రోజు సగటున 2.7 లీటర్ల నీళ్లు తాగడం మంచిదని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' వెల్లడించింది.
ఈ మోతాదుకు మించి నీళ్లు తాగితే కిడ్నీలు బయటికి పంపించగా మిగిలిన నీటిలోని సోడియం గాఢత రక్తంలోకి చేరుతుందట.
కణజాలాల వాపునకు కారణమై Hyponatremia అనే వ్యాధి వస్తుందని నిపుణులు అంటున్నారు.
ఒక్కొసారి ఈ వాపు మెదడు కణజాలాల్లోనూ రావచ్చని హెచ్చరిస్తున్నారు.
తద్వారా మూర్ఛ వంటి సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదమూ ఉందంటున్నారు.