అందరికి నిద్రపోయిన సమయంలో కలలు వస్తుంటాయి.అయితే ఆ కల మంచిదా? లేదా చెడ్డదా? అనేది కలలో వచ్చిన వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది.

 అందరికి నిద్రపోయిన సమయంలో కలలు వస్తుంటాయి.అయితే ఆ కల మంచిదా? లేదా చెడ్డదా? అనేది కలలో వచ్చిన వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది.

మీరు కలలో ఈ ఐదు రకాల లోహాలు చూస్తే మీకు మంచి, శ్రేయస్సు కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు.

 వెండి : స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన కలలో వెండి లోహాన్ని చూస్తే.. సమీప భవిష్యత్తులో అతను శుభవార్త పొందబోతున్నాడని అర్థం.

వెండి కలలోకి వస్తే వివాహం చేసుకోకపోతే.. త్వరలోనే మీకు ఆ భాగ్యం కూడా కలుగుతుంది. మీరు చాలా మంచి భాగస్వామిని పొందబోతున్నారని అర్థం.

 బంగారం : కలలో బంగారాన్ని చూడటం అశుభ కలగా పరిగణించబడుతుంది. కలలో బంగారాన్ని చూడటం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది.

 రాగి : కలలో రాగిని చూస్తే అది మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. మీరు ఏ లక్ష్యం కోసం కష్టపడుతున్నారో, ఆ లక్ష్యాన్ని మీరు సాధించబోతున్నారని ఈ కల సూచిస్తుంది.

ఇనుము :  ఒక వ్యక్తికి కలలో ఇనుము కనిపిస్తే.. రాబోయే కాలంలో ఆ వ్యక్తి తన కష్టానికి తగిన ఫలితాలను పొందబోతున్నాడని అర్థం.

 ఇత్తడి :  ఒక వ్యక్తి కలలో ఇత్తడి లోహాన్ని చూస్తే, దీని అర్థం మీరు ఉద్యోగం లేదా ఉపాధిలో పురోగతిని సాధించబోతున్నారని అర్థం. దీని వలన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.