తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి.

భోగి మంటలతో ప్రారంభించి.. కోడి పందేలు, ఎడ్ల పందేలు, ఇంకా పండుగ సందడితో బాగా ఎంజాయ్ చేశారు. 

ఇప్పుడు మూడో రోజున కనుమ పండుగను సైతం అంతే కనులవిందుగా జరుపుకుంటున్నారు

అయితే ఈ ఒక్కరూ పొలిమేర దాటకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే..?

ఎందుకంటే కనుమ రోజున కనీసం కాకి కూడా కదలదంటారు. 

కనుమ రోజున ఉదయాన్నే పశువులను పూజించి, మధ్యాహ్నం తమ పూర్వీకులకు తర్పణాలు ఇవ్వడం వంటివి చేస్తారు. 

మరికొన్ని ప్రాంతాల్లో కనుమ రోజున గ్రామ దేవతలకు మేకపోతు, కోడి, గొర్రె పొట్టేళ్లను బలి ఇస్తుంటారు. 

కనుమ రోజున ఇన్ని పనులు ఉంటాయి కాబట్టే  ప్రయాణం చేయకూడదని.. ఈరోజు విశ్రాంతి తీసుకోలంటారు పెద్దలు 

కనుమ రోజున ఎవరైనా ప్రయాణాలు చేస్తే అశుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. 

కనుమ రోజున ప్రయాణం చేయడం వల్ల ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంటుందని.. అందుకే మూడు రోజుల పాటు ముచ్చటగా పండుగను జరుపుకుని.. ఆ తర్వాత ప్రయాణం ప్రారంభించాలి

మరికొందరు పెద్దలు మాత్రం వీటిని కొట్టి పారేస్తున్నారు. ఏది ఎప్పుడు జరగాలో.. ఎలా జరగాలో అలా జరుగుతుందని చెబుతున్నారు.