ప్రస్తుతం బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిర్యానీ పాయింట్లు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నాయి.
కాలు బయట పెట్టకుండా జుమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ సర్వీసుల ద్వారా ఇంటి వద్దకే వేడివేడిగా బిర్యానీ వచ్చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్న ఆహారంలో 90 శాతం నాన్ వెజ్ వంటకాలే ఉంటున్నాయి.
అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు.. తరచుగా బిర్యానీ తినడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం యువత, చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
యువతకు కూడా చాలా ఆరోగ్య సమస్యలు లాంగ్‌టర్మ్‌లో వస్తాయంటున్నారు వైద్యులు.
మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే కడుపులో ఏదో ఒక సమస్య రావడం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇక హోటల్ బిర్యానీ ఎక్కువగా తినడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటున్నారు.
బిర్యానీలో హోటల్స్‌లో వాడే పదార్థాలు అంత ఆరోగ్యకరమైనవి కావు అని, తరచు బయట బిర్యానీ తినేవారికి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.
మితంగా తింటే పర్వాలేదు గానీ.. తరచుగా తింటే మాత్రం ముప్పు తప్పదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.