రాత్రి 8 తర్వాత ఈ ఆహారాలు తినకూడదు.. లేదంటే!
చాక్లెట్స్: ఇవి అధిక కేలరీల్ని జోడిస్తాయి. వీటిలో ఉండే మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు.. మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా, మేల్కొని ఉండేలా చేస్తాయి
ఆల్కహాల్: బరువు పెంచడంతో పాటు నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరిచేరే ప్రమాదం ఉంది
చిప్స్: ఇవి కేలరీలతో నిండి ఉంటాయి. ఆహారం తిన్నాక వీటిని సేవిస్తే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు చెప్తున్నారు
కూల్‌డ్రింక్స్: వీటిలో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. రాత్రిపూట వీటిని తాగితే, బరువు పెరగడంతో పాటు చాలా సమస్యలు వస్తాయి
ఐస్‌క్రీమ్స్: అర్థరాత్రి ఐస్‌క్రీమ్స్ తినేవాళ్లు చాలా ఎక్కువ. అయితే.. అలా తినడం వల్ల బరువు పెరగడంతో పాటు జలుబు బారిన పడతారు
ఆ ఆహారాల్ని తరచూ రాత్రిపూట తింటే.. ఊబకాయం, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు, నిద్రలేమి వంటివి వచ్చే అవకాశముంది
రాత్రిపూట భోజనం కూడా.. నిద్రపోవడానికి రెండు, మూడు గంటల ముందే తినాలని సర్వేలు చెప్తున్నాయి
రాత్రిపూట జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు