భోజనం చేశాక కొందరు నిద్రపోతుంటారు. దీని వల్ల గుండెలో మంట, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. గంట గ్యాప్ ఇవ్వాల్సిందే.

భోజనం చేశాక కొందరికి స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేస్తే.. అజీర్తి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

భోజనం చేశాక టీ, కాఫీ వంటివి తాగకూడదు. ఒకవేళ తాగితే.. ఆహారంలోని పోషకాల్ని గ్రహించే శక్తి శరీరానికి తగ్గిపోతుంది.

తిన్న వెంటనే నీళ్లు గడగడ తాగకూడదు. అలా చేస్తే.. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఎంజైమ్స్, జీర్ణ రసాలు తక్కువగా విడుదలవుతాయి.

తిన్న తర్వాత ఏదైనా పండు తీసుకోవడం మంచిదే కానీ.. కడుపునిండా తిన్నప్పుడు కాదు. అల్పాహారం తీసుకున్నప్పుడు తింటే ఉత్తమం.

భోజనం చేశాక వ్యాయామం చేస్తే.. ముందుగా శరీరం సహకరించదు. అయినా వ్యాయామం చేస్తే.. అసౌకర్యం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.

అయితే.. ఒక్కొక్కరి ఆరోగ్య స్థితి ఒక్కోలా ఉంటుంది కాబట్టి, ఈ సమస్యలు అందరిలో తలెత్తాలని లేదు. ఏదేమైనా.. డాక్టర్ సలహా తీసుకోవడం బెటర్.