సాధారణంగా పాలు అనేవి తెల్లగా ఉంటాయి. కానీ ఆవు పాలు కాస్త లేత పసుపు రంగులో ఉంటాయి.

అలా లేత పసుపు రంగులో ఎందుకు ఉంటాయనే విషయం మీరు ఎప్పుడైనా గమనించారా..?

ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉంటే.. కొన్ని కొన్ని జంతువుల పాలు కాస్త వేరే రంగులో కనిపిస్తుంటాయి.

ఇలా కొన్ని జంతువుల పాలు తెల్లగా ఉండకపోవడానికి ప్రత్యేక కారణమే ఉంటుంది.

ఆవు పాలలో బీటా కెరోటిన్‌ అనే పదార్థం కొంత ఎక్కువ మోతాదులో ఉంటుంది.

అందుకే ఆ పాలు లేత పసుపు రంగులో ఉంటాయి. అదే గేదె పాలలో ఆ పదార్థం లేకపోవడం వల్ల పాలు తెల్లగా ఉంటాయి.

చిన్న పిల్లలకు గేదె పాల కంటే ఆవు పాలు మంచివంటారు. వాటిలో కొవ్వు పదార్థం తక్కువ ఉంటుంది.

ఈ బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణం. ఆవుపాలు సులభంగా జీర్ణం అవుతాయి.

వాటిలో బీటి కెరోటిన్‌ ఏ విటమిన్‌గా మార్పు చెంది చిన్నారులకు ఉపయోగపడుతుంది.

పాలలో ఉండే వివిధ పదార్థాల నిష్పత్తి ఉన్న తేడాలను బట్టి ఆయా జంతువుల పాల రంగుల్లో మార్పులు ఉంటాయి.