మొదటి రోజున దుర్గాదేవి మొదటి రూపమైన శైలపుత్రిని పూజిస్తారు. భక్తులు పసుపు వస్త్రాలు ధరించాలి.
రెండవ రోజున మాతా బ్రహ్మచారిణిని పూజిస్తారు. ఆకుపచ్చని వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించాలి.
మూడవ రోజు దుర్గా చంద్రఘంట రూపాన్ని పూజిస్తారు. గోధుమ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించాలి.
నాల్గవ రోజున దుర్గా కూష్మాండ రూపాన్ని పూజిస్తారు. కాషాయ వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించాలి.
ఐదవ రోజున దుర్గా స్కందమాత రూపాన్ని పూజిస్తారు. తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించాలి.
ఆరవ రోజున కాత్యాయని దుర్గాదేవిని పూజిస్తారు. ఎరుపు రంగు బట్టలు ధరించి అమ్మవారిని పూజించాలి.
ఏడవ రోజు దుర్గాదేవి కాళరాత్రి రూపం. నీలం రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించాలి.
ఎనిమిదవ రోజున దుర్గా మహాగౌరీ రూపాన్ని పూజిస్తారు. గులాబీ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించాలి.
తొమ్మిదవ రోజు దుర్గాదేవిని పూజిస్తారు. భక్తులు ఊదారంగు వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించాలి.