ఫోన్లో లేటెస్ట్ వాట్సాప్ అప్లికేషన్ ఉండేలా చుసుకోవాలి.

యాప్ ఓపెన్ చేసి.. పర్సనల్‌ చాట్ లేదా, గ్రూప్ చాట్ ఓపెన్‌ చేయాలి.

ఐఓఎస్ యూజర్లు అయితే.. మెసేజ్ బాక్స్ పక్కన ఉన్న ప్లస్ సింబల్ను నొక్కాలి. ఆండ్రాయిడ్ యూజర్లు.. పేపర్‌ క్లిప్ సింబల్ను క్లిక్ చేయాలి.

వెంటనే ఒక మెనూ ఓపెన్ అవుతుంది.

అందులో చివర్లో పోల్స్ ఆప్షన్ కనిపిస్తుంది.

'పోల్' అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే.. కొత్త మెనూ ఓపెన్ అవుతుంది.

అనంతరం.. పోల్ ప్రశ్నను అడుగుతుంది. దీనికి సమాధానాలు యాడ్ చేయాల్సి ఉంటుంది.

సమాధానాల కోసం మొత్తం 12 ఆప్షన్లు ఇవ్వొచ్చు.

ఆప్షన్లన్నీ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ చేస్తే సరిపోతుంది.

పోల్ రిసీవ్ చేసుకున్నవారు ఆన్సర్పై క్లిక్ చేస్తే.. ఓటు నమోదవుతుంది.

ఏ ఆప్షన్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఏ ఆప్షన్ను ఎవరు ఎంచుకున్నారు, ఎంతమంది ఓటేశారనే.. విషయాలన్నీ కనిపిస్తాయి.

వాట్సాప్‌లో గ్రూపులు, సభ్యుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోల్ ఫీచర్ యూజర్లను ఉపయుక్తంగా ఉంటుందని WhatsApp పేర్కొంది.