ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి హెల్త్‌ పారామీటర్స్‌ అస్తవ్యస్తంగా ఉంటుంది. 

ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరూ ఒకటికంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.  

గతేడాది దేశవ్యాప్తంగా 56వేల మంది ఐటీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై ఓ   సంస్థ అధ్యయనం చేసింది. 

  ఈ ఉద్యోగుల్లో 22% మంది ఊబకాయం, 17% ప్రి డయాబెటీస్, 11% రక్తహీనత, హైపో థైరాయిడిజం వ్యాధులు వస్తున్నాయట.

వీరిలో దాదపు 7%పైగా చిన్న వయసులోనే మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనం తేల్చింది. 

పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలు చాలా అస్తవ్యవస్తంగా ఉన్నాయి. 

వీరిలో 14% రక్తహీనతతో, 13% ఊబకాయంతో, 8% హైపోథైరాయిడిజంతో, 7% ప్రిడయాబెటీస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 

 ప్రధానంగా 40ఏళ్లు దాటిన వారిలో చాలా ప్రమాదకరస్థితిలో ఈ పారామీటర్స్‌ పెరుగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

 అధిక కొవ్వు, ఊబకాయం, ప్రి డయాబెటీస్‌, డయాబెటీస్‌ ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది. 

కేవలం 23% మంది ఉద్యోగుల హెల్త్‌ పారామీటర్స్‌ తగిన స్థాయిల్లో ఉన్నాయని వెల్లడించింది. 

ఇక పరీక్షలు చేయించుకున్న వారిలో 37% మందికి ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉన్నాయట.