మనిషి జీవితంలో శృంగారం ఒక గొప్ప అనుభూతి అందించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రస్తుత రోజుల్లో పనుల ఒత్తిడి, ఆందోళన, ఇతర కారణాల వల్ల శృంగార సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. 

పురుషుల్లో ఈ సమస్యలను త్వరగా గుర్తించలేకపోతున్నారు. డాక్టర్ల వద్దకు వెళ్లి చెప్పుకునేందుకు పురుషులు సిగ్గుపడుతున్నారు. ఫలితంగా సమస్య సమస్యగానే ఉండిపోతుంది. శృంగారం కరువై చాలా జంటలు విడిపోతున్నాయి.

శృంగారంలో పాల్గొన్న సమయంలో దంపతులిద్దరూ లోకాన్ని మర్చిపోతారు. తీయటి అనుభూతుల్లో తేలియాడుతుంటారు. ఈ సమయంలో కొందరు మగాళ్లలో సెక్స్ బలహీనతలు ఇబ్బంది పెడుతున్నాయి. 

ముఖ్యంగా శీఘ్రస్కలనం, వీర్యం రాకపోవడం, అకాల స్కలనం, ఇన్‌ఫెర్టిలిటీ, సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. 

శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ విఫలం చెందుతున్నారు. చాలా జంటలు పడకగదిలో లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నా.. వాటి గురించి బయట చాలా అరుదుగా మాట్లాడతారు.

అకాల స్కలనం- ఈ సమస్య ఎక్కువగా యువతలో కనుబడుతున్నదని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య మధ్య వయస్కుల్లో కూడా వస్తుందని యూరో ఆండ్రాలజిస్టులు పేర్కొంటున్నారు. 

శీఘ్ర స్కలనం- ఇది చాలా మంది పురుషులను ఇబ్బంది పెట్టే సమస్య. అధిక వేడి శరీరం ఉన్న పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆహారంలో కొన్ని మార్పులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఇన్‌ఫెర్టిలిటీ- స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువ ఉండటం. ఈ సమస్య ఉన్న వారి ద్వారా గర్భం రావడం, పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్య కనిపించగానే వైద్యులను సంప్రదించి స్పెర్మ్‌ కౌంట్‌ పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జీవనశైలి గురించి సలహాలు పొందడం శ్రేయస్కరం. 

సెక్స్‌పై ఆసక్తి తగ్గడం- చాలా మందిలో సెక్స్ కోరికలు బాగా తగ్గుతుంటాయి. దీనికి ప్రధాన కారణం టెస్టోస్టిరాన్‌ తగ్గిపోవడం. దీని వల్లనే పురుషుల్లో సెక్స్‌ కోరిక సన్నగిల్లిపోతుంది. ఒత్తిడి, అతిగా ఆలోచించడం, పని ఒత్తిళ్ల కారణంగా వల్ల టెస్టోస్టిరాన్‌ తగ్గిపోతుంది.

అంగ స్తంభనం- ఇటీవలి కాలంలో అంగ స్తంభనం సమస్య ప్రధానంగా చాలా మందిలో కనిపిస్తున్నది. చాలా సందర్భాల్లో థైరాయిడ్‌ తగ్గుదల, షుగర్‌, బీపీతో ఈ సమస్య లింక్‌ అయి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.

మధుమేహం​, కొలెస్ట్రాల్, రక్తపోటు తదితర శారీరక జబ్బులు ఉండటం సెక్స్​ జీవితంపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. ఒత్తిళ్లకు గుడ్‌బై చెబితే శృంగార అనుభూతిని ఆస్వాదించవచ్చు.