ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం సాధారణ అలవాటు.

 ఆయుర్వేదం ప్రకారం, భోజనం చేసిన వెంటనే నీరు తాగడం జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. 

  ఆహారం జీర్ణం కావడానికి శరీరం ఎంజైమ్‌లు, ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. 

 మీరు ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే, అది ఎంజైములు, ఆమ్లాలను పలుచన చేస్తుంది. 

  దీనివల్ల అపానవాయువు, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

 ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం ద్వారా, మీరు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.  

 నీరు మీ కడుపుని నింపుతుంది. కానీ కొంత సమయం తర్వాత ఆహారం సరిపోకపోవడంతో..

మళ్లీ ఆకలిగా అనిపించడం ప్రారంభిస్తుంది. 

ఈ విధంగా మీరు ఎక్కువగా తింటారు. దీని వలన బరువు పెరుగుతారు.  

 నీరు ఆహారంలో ఉండే పోషకాలను పలుచన చేస్తుంది. 

 తిన్న వెంటనే కాకుండా అరగంట తర్వాత తాగితే మంచిది.