ఉదయం నిద్ర లేవగానే చాలా మంది బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు. దీనిని ఒక స్టేటస్ సింబల్‌గా కూడా భావిస్తుంటారు.
ఇలాంటి సమయంలో కాఫీ, టీ తాగితే జీర్ణ వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది.
లేవగానే టీ, కాఫీలకు బదులుగా మంచి నీరును తాగే అలవాటు చేసుకోండి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగండి.
మేలుకోగానే దాదాపు అందరూ చేసే పని పక్కన ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి చెక్ చేయడం. కానీ ఇది మంచి అలవాటు కాదు.
లేవగానే చూడకూడని, చదవకూడని ఏదైనా విషయం మన కంటపడిందంటే రోజంతా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అలాగే నిద్రలేవగానే గబగబా పనులు మొదలు పెట్టకూడదు. మొదట కాసేపు కాళ్లు, చేతులు కదిపిస్తూ వామప్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల నిద్ర మత్తు పోవడంతో పాటు శరీరానికి కాస్త ఉపశమనంగా కూడా ఉంటుంది.
బెడ్ దిగగానే అదరబాదరగా వెళితే నిద్ర మత్తులో తూలి పడే ప్రమాదం ఉంటుంది.
మార్నింగ్ కచ్చితంగా కనీసం 20 నిమిషాలైనా యోగా, వ్యాయామం వంటివి చేయాలి.
మరీ ముఖ్యంగా రోజూ ఒకే సమయానికి లేవడాన్ని అలవాటు చేసుకోవాలి.