ఉదయాన్ని ఖాళీ కడుపుతో ఈ ఆహార పదార్థాలు అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. 

ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. 

అయితే ఈ హ్యాబిట్ శరీరంలో ఆమ్లాలను పెంచి ఇబ్బందులకు గురి చేస్తుంది.

ఉదయాన్నే స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే జీర్ణ సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు.

సిట్రస్ ఫ్రూట్స్ ఖాళీ కడుపుతో తీసుకోకూడదని చెప్తున్నారు. 

ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా.. ఉదయాన్నే తీసుకుంటే కడుపులో ఇరిటేషన్ కలుగుతుంది. 

 చక్కెర కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదముంది.

ఇది మిమ్మల్ని రోజంతా ఇబ్బందులకు గురిచేస్తుంది.

ప్రాసెస్ చేసిన ఫుడ్స్, పలు రకాల డ్రింక్స్​కు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు. 

వీటిని ఉదయమే కాకుండా.. రోజులో ఏ సమయంలో అయినా తీసుకోకపోవడమే మంచిదంటున్నారు.

ఉదయాన్నే డెయిరీ ఫుడ్స్​కి దూరంగా ఉంటే మంచిదంటున్నారు.