వాషి రైల్వే స్టేషన్ ముంబాయ్‌లోని ఇంటర్నేషనల్ ఇన్ఫోటెక్ పార్క్ బిల్డింగ్ క్రింద ఈ స్టేషన్ నిర్మించబడింది.

సార్‌నాథ్ రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ నిర్మాణం & కట్టడం మొత్తం సాంచీ స్తూపం ఆధారంగా డిజైన్ చేయబడింది.

రాయపురం రైల్వే స్టేషన్ దక్షిణ రైల్వేలో ఇది అత్యంత పురాతణమైన స్టేషన్. ఇది 1856 జూన్ 28లో ప్రారంభించబడింది

రషిద్‌పుర కోహ్రి రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్, టిటిఇ, గార్డ్ వంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు. పూర్తిగా స్థానికుల ఆధారంతో నడుస్తోంది.

మన్వాల్ రైల్వే స్టేషన్ మొదటి గ్రీన్ స్టేషన్‌గా ఇది పేరుగాంచింది. లైట్లు & ఫ్యాన్లు అన్నింటికి సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందుతుంది.

గుమ్ రైల్వే స్టేషన్ ఇది భారతదేశంలోకెల్లా అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్. సముద్ర మట్టానికి 7,407 అడుగుల ఎత్తులో ఉంది.

దూద్‌సాగర్ రైల్వే స్టేషన్ ఇండియన్ రైల్వేలోనే ఇది అతి చిన్న రైల్వే స్టేషన్‌. భగవాన్ మహవీర్ అభయారణ్యంలో ఉన్న జలపాతానికి సమీపంలో ఈ స్టేషన్ ఉంది.

ధనుష్కోటి రైల్వే స్టేషన్ ఘోస్ట్ టౌన్‌గా పిలువబడే ధనుష్కోటి ఈ స్టేషన్ ఉంది. దెయ్యాల పట్టణంలో ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ ఇదే!

కటక్ రైల్వే స్టేషన్ ఓ కోట తరహా నిర్మాణం.. ఈ స్టేషన్ ప్రత్యేకత. ఎంట్రన్స్ & లోపలి భాగం పూర్తిగా కోటలాగే నిర్మించబడి ఉంటుంది.

భవాని మండి రైల్వే స్టేషన్ రెండు రాష్ట్రాలను వేరూ చేస్తూ ఈ స్టేషన్ నిర్మించబడింది. ఉత్తర భాగం వైపు మహారాష్ట్ర, మరోవైపు రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి.