సాధారణంగా సినిమా కలెక్షన్స్ విషయంలో గ్రాస్, నెట్, షేర్ అనే పదాలు వాడుతుంటారు

కానీ చాలా మందికి గ్రాస్, నెట్, షేర్ వసూళ్ల గురించి అవగాహన ఉండదు.

గ్రాస్ అంటే మొత్తంగా అమ్మిన టిక్కెట్ల ద్వారా వచ్చే డబ్బులు

షేర్ అంటే గ్రాస్ వసూళ్ల నుంచి థియేటర్ల రెంట్, మెయింటెన్స్ ఛార్జీలను మినహాయిస్తారు

నెట్ అంటే గ్రాస్ వసూళ్లలో ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ తీసి లెక్కిస్తారు

సినిమా సినిమాకు ట్యాక్స్ పర్సంటేజ్ మారుతుంటుంది... డబ్బింగ్ సినిమాలకు ట్యాక్స్ పర్సంటేజ్ పెరుగుతుంది

తమిళనాడులో విడుదల చేసే తెలుగు సినిమాలకు ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది

ఫిక్స్‌డ్‌ హైర్ అంటే డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్ లేదా థర్డ్ పార్టీ వాళ్లు సినిమాను కొంత మొత్తానికి కొనుగోలు చేయడం

హైర్స్ విషయంలో వసూళ్లు ఎంత వచ్చినా కొనుగోలు చేసిన మొత్తాన్నే పరిగణనలోకి తీసుకుంటారు