మధుమేహం దీర్ఘకాలంగా నియంత్రణలో లేనివారికి తెచ్చిపెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధుమేహం మూలంగా మగవారిలో టెస్టోస్టీరాన్ మోతాదులు తగ్గుతాయి. శృంగారం మీద ఆసక్తి, ఉత్సాహం సన్నగిల్లుతుంది.
కుంగుబాటు, ఆందోళన, నిస్సత్తువ, బరువు పెరగటం, తరచూ మూత్ర ఇన్‌ఫెక్షన్లు, స్తంభన లోపం, సంతాన సామర్థ్యం తగ్గటం వంటివి బాధిస్తాయి.
ఇక ఆడవారిలో శారీరకంగా, మానసికంగానూ సమస్యలు మొదలవుతాయి. శృంగార వాంఛ లోపించటం, యోని పొడిబారటం, సంభోగ సమయంలో నొప్పి, మూత్రకోశ ఇన్‌ఫెక్షన్ల వంటివి వేధిస్తుంటాయి.
మామూలు వారితో పోలిస్తే అండాశయాల్లో నీటితిత్తులు గల యువతుల్లో మధుమేహం 10 రెట్లు ఎక్కువ. నెలసరి సమయంలో అండం విడుదల కాకుండా అడ్డుకుంటాయి. కొన్ని జాగ్రత్తల ద్వారా ఇలాంటి దుష్ప్రభావాలను అధిగమించొచ్చు.
క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ గ్లూకోజు మోతాదులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. అవసరమైతే ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవటానికి వెనకాడొద్దు.
ఆకుకూరలు, కూరగాయలు, క్యారట్లు, చిక్కుళ్లు, బటానీలు, బ్రోకలీ, తాజా పండ్లు, గింజపప్పుల వంటివి తీసుకోవాలి.
రోజూ వ్యాయామం చేయటం తప్పనిసరి. ధ్యానం, యోగాలను జత చేసుకుంటే ఇంకా మంచిది.
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల ముందు కూర్చోవటం తగ్గించుకోవాలి.
తగినంత సేపు, కంటి నిండా నిద్ర పోవాలి.
పొగ, మద్యం, అతిగా కెఫీన్ తీసుకోవటం వంటి అలవాట్లుంటే మానుకోవాలి.
మంచి పుస్తకాలు చదవటం, శ్రావ్యమైన సంగీతం వినటం వంటి ఒత్తిడిని తగ్గించే పనులు చేయాలి.
Fill in some text
మగవారిలో స్తంభనలోపం, ఆడవారిలో అసంకల్పితంగా యోని కండరాలు సంకోచించటం వంటి సమస్యలుంటే చికిత్స తీసుకోవాలి.
శృంగార సమస్యల గురించి ఏవైనా ఆందోళనలకు గురవుతుంటే మానసిక నిపుణుల సలహా తీసుకోవాలి.