కొంతమంది కష్టం వచ్చినప్పుడు, సినిమా చూస్తూ, మరికొందరు పుస్తకం చదువుతూ.. ఇలా ఏడుపుకు రకరకాల కారణాలుంటాయి. 

కానీ ఏ కారణమూ లేకుండా కొందరు అలా ఊరికే ఏడ్చేస్తారు. చెప్పాలంటే ఏడుస్తూ అలా దిగాలుగానే ఉంటారు.

 ఇదొక నరాల సంబంధిత వ్యాధి అనుకోవచ్చు. మెదడులో ఏదైనా దెబ్బతింటే నవ్వు, ఏడుపు అదుపులో ఉండవు. 

 ఏదైనా కష్టం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లి ఉండొచ్చు. కొన్ని రోజుల పాటూ దాన్నుంచి బయటకు రాలేకపోతే బాధ మరింత ఎక్కువవుతుంది.  

 ఇలా ఏడవటం మానేయాలంటే ఈ చిట్కాలు పాటించండి.   

 శ్వాస సంబంధించిన వ్యాయామాలు చేయండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. 

 ముక్కుతో శ్వాస తీసుకుని మెల్లగా నోటితో వదలండి. దీంతో ఒత్తిడి తగ్గినట్లనిపిస్తుంది. ఏడవటం ఆపేస్తారు.

మీకిష్టమైన పాట పాడటమో, పద్యమో, పుస్తకమో, ఏదైనా సంఘటన గురించే ఆలోచిస్తూ ఉండటమో చేయండి.  

  లేదా మీకిష్టమైన పనిలో నిమగ్నం అవ్వండి. 

 మీ ముక్కును శ్వాస తీసుకోకుండా కాసేసు అలా చేత్తో గట్టిగా పట్టి ఉంచండి.