నెదర్లాండ్స్: స్వలింగ వివాహానికి చట్టబద్ధత కల్పించిన మొదటి దేశంగా నిలిచింది. 2001లో దీనికి అనుమతించింది.
అర్జెంటీనా: అర్జెంటీనా 2010లో స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసింది.
ఆస్ట్రేలియా: 2017లో ఆస్ట్రేలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జర్మనీ: జర్మనీ స్వలింగ వివాహాలను 2017లో చట్టబద్ధం చేసింది.
మెక్సికో: మెక్సికో సిటీలో 2010లో చట్టబద్ధం చేయబడింది. ఇతర రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో అమలులోకి వచ్చింది.
యూకే: 2014లో యునైటెడ్ కింగ్‌డమ్ స్వలింగ వివాహానికి గుర్తింపునిచ్చింది.
ఉత్తర ఐర్లాండ్: 2020లో ఉత్తర ఐర్లాండ్ ఈ వివాహాన్ని ఆమోదించింది.
అమెరికా కూడా స్వలింగ వివాహిత జంటలకు ఇతర జంటల మాదిరిగానే ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జూలై 9, 2015 నుండి అమల్లోకి వచ్చింది.
తైవాన్, బెల్జియం, కెనడా, స్పెయిన్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్ మరియు ఫిన్లాండ్ వంటి దేశాలు కూడా స్వలింగ వివాహాలను అనుమతిస్తాయి.