కరోనావైరస్ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడగా చైనా మాత్రం దాని విశ్వరూపం చూస్తోంది.

చైనాలో మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ హెచ్చరించారు. 

రానున్న రోజుల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతాయని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. 

చైనాతో పాటు ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.

చైనాలో కరోనా ఆంక్షలు ఇటీవలే ఎత్తివేశారు. దీంతో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఇప్పటికే, ఆసుపత్రులు నిండిపోయాయి. ఇంటెన్సివ్ కేర్ బెడ్‌లను ఏర్పాటు చేయడానికి. 

ఫీవర్ స్క్రీనింగ్ క్లినిక్‌లను నిర్మించడానికి ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తోంది. 

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే శ్మశాన వాటికలు 24 గంటల పాటు పనిచేస్తున్నాయి

ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న మృతదేహాలతో శ్మశాన వాటికలు నిండిపోయాయి.

మీడియా నివేదికలను ఉటంకిస్తూ, చైనా ప్రధాన భూభాగంలో మరణాలు చాలా తక్కువగా నివేదించబడుతున్నాయని ఫీగల్-డింగ్ పేర్కొన్నారు. 

అయితే.. లెక్కలు వాస్తవానికి చాలా దూరంలో ఉన్నాయని అక్కడ వేలల్లో మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు.