పంచదార లేనిదే తీపికి అర్థం ఉండదు. మనం చేసుకునే అన్ని తీపి పదార్థాల్లో చక్కెరను వాడుతాం.
చక్కెరను అతిగా తీసుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
పంచదార చేసిన పదార్థాలను అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారు.
చక్కెర గుండె జబ్బులను పెంచే అవకాశం ఉంది.
చక్కెరను అధికంగా తీసుకుంటే మొటిమలు ఎక్కువ అవుతాయి.
పంచదారతో టైప్ - 2 డయాబెటిస్ ముప్పు పొంచిఉంటుంది.
అతి చక్కెర వినియోగం క్యాన్సర్‌కు కారణం కూడా కావచ్చు.
చర్మం వృద్ధాప్య ప్రక్రియను పంచదార వేగవంతం చేస్తుంది.
పంచదార వల్ల డిప్రెషన్ ప్రమాదం పొంచి వుంటుంది.