తల దువ్వుకునేటప్పుడు మీకు తెలియకుండానే కొన్ని తప్పులు చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది.. అవి ఏంటో తెలుసుకోండి.

చాలా మంది చేసే తప్పు కుదుళ్ల నుంచి గట్టిగా దువ్వుతారు. ఇలా దువ్వడం వల్ల కుదుళ్లు బలం తగ్గి కురులు బాగా రాలిపోతాయి. 

జుట్టు చిక్కులు పడినప్పుడు గట్టిగా నెమ్మదిగా దువ్వాలి. 

 కొనల నుంచి దువ్వుకుంటూ కుదుళ్ల వరకు రావాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది.

వెనక్కి దువ్వొద్దు.. అలా చేస్తే జుట్టు కాస్త చింపిరిగా తయారవుతుంది. 

వెనక్కి దువ్వడం వల్ల జుట్టు చిట్లిపోవడం, కుదుళ్లు దెబ్బతిని వెంట్రుకలు బలహీనంగా మారడం.. వంటివి జరుగుతాయి.

జుట్టు ఉత్పత్తులు వాడేటప్పుడు పడిన చిక్కులను తీయడానికి దువ్వెన ఉపయోగించొద్దు.  చేతి వేళ్ల సాయంతో జుట్టు చిక్కులు తీయడం మంచిది

తలస్నానం కాగానే జుట్టును ఆరబెట్టకుండా వెంటనే దువ్వడం వల్ల జుట్టు తెగిపోయి వూడిపోయే ప్రమాదమే ఎక్కువ. 

అరగంట పాటు జుట్టు ఆరిన తర్వాత దువ్వుకుంటే జుట్టు బలహీనం కాకుండా కాపాడుకోవచ్చు.