కాఫీ షాపులు ఆర్ట్ గ్యాలరీల్లా మారిపోతున్నాయి..
ప్రతీది ట్రెండ్‌కు తగ్గట్టు మారిపోతున్నది. కాఫీ షాప్‌లు కూడా అందుకుమినహాయింపు కాదు.
ఒకప్పుడు అక్కడ.. మహా అయితే రకరకాల కాఫీలు దొరికేవి.
ఇప్పుడు, కప్పు కాఫీతోపాటు పైకప్పు మొదలు గోడల వరకు కళాత్మకత ఉట్టిపడే వాతావరణం
ఆ ఆవరణలు ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు, వేలంపాటలతో కళకళలాడుతున్నాయి
సగం కాఫీ షాపులా, సగం ఆర్ట్‌గ్యాలరీలా మారిపోతున్నాయి
కాఫీ దొరికేచోట ఆర్ట్ ఉండదు, ఆర్ట్ ఉండే చోట మంచి కాఫీ లభించదు
ఆ లోటును పూడ్చడానికే ఆర్ట్ కెఫేలు వస్తున్నాయి. ఇక్కడ ప్రముఖ కళాకారుల చిత్రాలు గోడలపై దర్శనమిస్తాయి
హైదరాబాద్‌లోని గ్యాలరీ కెఫేను ‘కళాకారుల స్వర్గం’ అని పిలుస్తారు
బెంగళూరు కోరమంగళలోని ‘డ్యూ ఆర్ట్ కెఫే’ సృజనలో ఓ అడుగు ముందుకేసింది
అహ్మదాబాద్‌లో ఉంది. దీని పేరు ‘ద ప్రాజెక్ట్ కెఫే’. ఇక్కడ నిత్యం ఏదో ఒక వర్క్‌షాప్, ఈవెంట్ జరుగుతాయి
కేరళ, కొచ్చిలోని కాశీ ఆర్ట్ కెఫే నినాదం చదివినప్పుడు ఆర్ట్ కెఫేల అసలు లక్ష్యం అర్థం
బుక్‌షెల్ఫ్‌లో సమకాలీన కళకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. అంతేనా, యాక్టింగ్ వర్క్‌షాపులకు, నాటక ప్రదర్శనలకు వేదిక