ఫోన్లకు తెగ అలవాటుపడిన పిల్లలు నలుగురిలో అంతగా కలవలేరు..

పదిమందిలో మాట్లాడాలంటే సదరు పిల్లలు భయపడుతుంటారు..

ఆనందోత్సాహాల మధ్య హాయిగా సాగిపోవాల్సిన బాల్యం భారంగా మారుపోతుంది..

పేరెంట్స్‌గా తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి..

ప్రతిరోజూ ఓ అరగంట అయినా పిల్లలకు కబుర్లు చెబుతూ ఉండాలి..

ఫోన్‌ చూడకుండా కఠిన నిబంధనలు పెడితే.. పిల్లలు చిన్నబుచ్చుకుంటే ఫర్వాలేదు..

ఫోన్‌ చూసే వేళలు ఫిక్స్‌ చేయండి.. వాళ్లు ఏం చూస్తున్నారో ఓ కంట కనిపెడుతూనే ఉండాలి..

నిదానంగా స్క్రీన్‌ టైమ్‌ తగ్గిస్తూ.. ఫోన్‌ అలవాటును దూరం చేయండి..

పిల్లలకు ఇష్టమైన ఆటల్లో శిక్షణ ఇప్పిస్తే.. వాళ్ళు ఫోన్ జోలికి వెళ్లరు..